Former Indian cricket captain Mahendra Singh Dhoni is among over 1,800 homebuyers of Amrapali housing projects in Noida who have been asked by a Supreme Court-appointed receiver to start making payments of their outstanding dues within 15 days.
#MSDhoni
#AmrapaliGroup
#SupremeCourt
#housing
#Flats
#RealEstate
#IPL2021
#CSK
#SakshiDhoni
#Cricket
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి గట్టి షాక్ తగిలింది. అమ్రాపాలి గ్రూప్ బాధితులకు 15 రోజుల్లో డబ్బులు చెల్లించాలని భారత మాజీ కెప్టెన్‌తో పాటు కంపెనీ యాజమాన్యానికి సుప్రీమ్ కోర్ట్ నోటీసులు జారీ చేసింది. ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు 2009 నుంచి 2016 వరకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించాడు. ధోనీని నమ్మి ఫ్లాట్స్ కొనుగోలు చేసిన సుమారు 1800 మందికి వాటిని కేటాయించడంలో ఆమ్రపాలి కంపెనీ విఫలమైంది. దాంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రచారకర్త ధోనీతో పాటు ఆమ్రాపాలి యాజమాన్యానికి గురువారం నోటీసులు జారిచేసింది. బాధితులకు డబ్బులు చెల్లించేందుకు 15 రోజులు గడువిస్తున్నామని పేర్కొంది.